Magazines

మెరిసిన జురెల్‌

55 నిమిషాల క్రితం

Jurel Shines
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌ 291/7

క్రైస్ట్‌చర్చ్‌ : భారత్‌-ఏ, న్యూజిలాండ్‌-ఏ రెండో అనధికార టెస్టులో వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (99 నాటౌట్‌, 155 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో ఆశించిన ఆరంభం రాలేదు. యశస్వి జైస్వాల్‌ (0) డకౌట్‌ కాగా, సాయి సుదర్శన్‌ (41), దేవదత్‌ పడిక్కల్‌ (80, 140 బంతుల్లో 12 ఫోర్లు) రెండో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. యశ్ రాథోడ్‌ (13), రవిచంద్రన్‌ స్మరణ్‌ (0), వాషింగ్టన్‌ సుందర్‌ (8), మానవ్‌ సుతార్‌ (22) నిరాశపరచగా భారత్‌-ఏ 160/6తో ఒత్తిడిలో పడింది. ఈ స్థితిలో కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ ఆదుకున్నాడు. అజేయ ఇన్నింగ్స్‌తో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆకాశ్‌ దీప్‌ (25 నాటౌట్‌, 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి అజేయంగా క్రీజులో నిలిచాడు. భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 7 వికెట్లకు 291 పరుగులు చేసింది. కివీస్‌-ఏ బౌలర్లలో సీయట్‌ (4/54) నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్