జపాన్ మాస్టర్స్ సూపర్ 500
కుమమోటో (జపాన్) : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఎనిమిదో సీడ్ లక్ష్యసేన్ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో జపాన్ ఆటగాడు యుషి తనకపై వరుస గేముల్లో గెలుపొందాడు. 21-16, 21-15తో 39 నిమిషాల్లోనే లక్ష్యసేన్ మ్యాచ్‌ను ముగించాడు. తొలి గేమ్‌లో 11-8తో విరామ సమయానికి ముందంజలో నిలిచిన లక్ష్యసేన్ ప్రత్యర్థి పుంజుకున్నా 21-16తో ఆధిక్యం సాధించాడు. తొలి గేమ్ ఆరంభంలో ఉత్కంఠగా సాగింది. అయినా, లక్ష్యసేన్ 11-9తో ఆధిక్యంలో నిలిచాడు. 21-15తో రెండో గేమ్‌తో పాటు సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 22-24, 15-21తో కొకి వాటనాబె (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. నేడు సెమీఫైనల్లో ఇండోనేషియా సట్లర్ వర్లడ్ నం.10 అల్వీ ఫర్హాన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.






కామెంట్‌లు (0)