తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్
నవతెలంగాణ-హైదరాబాద్ :
తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్‌లో సింగిల్స్ విజేతలుగా సువీర్, రక్షిత నిలిచారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో 15-21, 21-18, 21-19తో భరత్ రాఘవ్‌పై తుషార్ సువీర్ గెలుపొందగా, మహిళల సింగిల్స్ ఫైనల్లో 16-21, 21-15, 21-14తో రుజులా రాముపై రక్షిత శ్రీ సంతోష్ రామరాజ్ విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్‌లు 21-12, 21-18తో సాయి ప్రతీక్, రూబన కుమార్‌లపై నెగ్గగా.. మహిళల డబుల్స్‌లో జపాన్ షట్లర్లు మెయ్ సుడో, మై తనబే జోఈ 21-11, 2-11తో థాయ్‌లాండ్ జోడీపై గెలుపొంది టైటిల్స్ అందుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో రోడియన్ అలిమోవ్, అలీనా డావ్లెటోవా జోడీ 19-21, 21-11, 21-13తో సతీశ్ కుమార్, అశ్విని పొన్నప్పలపై విజయం సాధించారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు వంకినా చాముండేశ్వరనాథ్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి కనూరి వంశీధర్‌లు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.







కామెంట్‌లు (0)