Magazines

ప్రయివేట్ మోజు.. ప్రభుత్వ బడుల బేజారు

1 గంట క్రితం

Private school
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – అశ్వారావుపేట

మెరుగైన సౌకర్యాలు, కార్పొరేట్ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న మోజుతో గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. గుమ్మం ముందుకే వచ్చే ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో పిల్లలను ఎక్కించి పట్టణాలకు పంపుతుండటంతో ఊరి బడులు ఖాళీ అవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో వేళ్లపై లెక్కించేంత మంది విద్యార్థులు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను నవతెలంగాణ మంగళవారం సందర్శించగా ఆసక్తికర పరిస్థితులు వెలుగుచూశాయి.

జీపీఎస్ మొద్దులగూడెం పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 28 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. 1వ తరగతిలో ముగ్గురు, 2వ తరగతిలో ఇద్దరు, 3వ తరగతిలో తొమ్మిది మంది, 4వ తరగతిలో ఒకరు, 5వ తరగతిలో 13 మంది విద్యార్థులు చదువుతున్నారు.


ఎంపీయూపీఎస్ గుర్రాలచెరువులో 1 నుంచి 7వ తరగతి వరకు తరగతులు నిర్వహించాల్సి ఉండగా, 6, 7 తరగతుల్లో విద్యార్థులు లేకపోవడంతో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే బోధన సాగుతోంది. మొత్తం 16 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. 1వ తరగతిలో ముగ్గురు, 2వ తరగతిలో ఇద్దరు, 3వ తరగతిలో నలుగురు, 4వ తరగతిలో నలుగురు, 5వ తరగతిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు.


జీపీఎస్ మారుతీనగర్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 1 నుంచి 5వ తరగతి వరకు కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉండగా, ఒకే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని తరగతుల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రైవేట్ విద్యపై పెరుగుతున్న ఆకర్షణ, గ్రామాల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యతో ప్రభుత్వ పాఠశాలల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్