Magazines

ఆధిక్యం ఉత్కంఠ

51 నిమిషాల క్రితం

Thrill
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌, చత్తీస్‌గఢ్‌ రంజీ మ్యాచ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌ : చత్తీస్‌గఢ్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ వరుసగా రెండోరోజు పట్టు వదిలేసింది. తొలి రోజు ఉదయం సెషన్లో బౌలర్లు వరుస వికెట్లు పడగొట్టినా.. రెండో సెషన్‌ నుంచి పరుగుల నియంత్రణ లేకపోయింది. రెండో రోజు బ్యాట్‌తో మంచి ఆరంభం దక్కినా..మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కుతుందో లేదే అనే ఉత్కంఠ నెలకొంది. రాహుల్‌ రాదేశ్‌ (72, 174 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీకి తోడు కొడిమెల హిమతేజ (46, 67 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిరథ్‌ రెడ్డి (35, 60 బంతుల్లో 3 ఫోర్లు) రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ మంచి స్కోరు సాధించేలా కనిపించింది. కానీ మిడిల్‌ ఆర్డర్‌లో ప్రజ్ఞయ్‌ రెడ్డి (17), వరున్‌ గౌడ్‌ (23), రుతిక్‌ యాదవ్‌ (4), సీవీ మిలింద్‌ (1) నిరాశపరిచారు. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (3)మరోసారి ఆరంభంలో వికెట్‌ కోల్పోయాడు. రాహుల్‌ రాదేశ్‌.. అభిరథ్‌ రెడ్డి, హిమతేజతో కలిసి వరుసగా అర్థ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కానీ ఆఖరు సెషన్లో వేగంగా వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ ఒత్తిడిలో పడింది. తనయ్‌ త్యాగరాజన్‌ (29 నాటౌట్‌, 56 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), రక్షణ్‌ రెడ్డి ( నాటౌట్‌, 5 బంతుల్లో) పదో వికెట్‌కు అజేయంగా 13 పరుగులు జోడించారు. రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో 9 పరుగుల వెనుకంజలో నిలచింది. అంతకముందు, చత్తీస్‌గఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు కుప్పకూలింది. సీవీ మిలింద్‌ (3/19), రక్షణ్‌ రెడ్డి (3/37), అనికెత్‌ రెడ్డి (2/59) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కీలకం కానుండటంతో నేడు ఉదయం సెషన్‌ తొలి 15 నిమిషాల ఆట ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్