హెచ్‌పిఆర్‌సీ పోలో టోర్నమెంట్
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్ (హెచ్‌పీఆర్‌సీ) పోలో టోర్నమెంట్‌లో టైగర్స్, ఆర్టిస్ట్స్ జట్లు అజేయంగా దూసుకెళ్తున్నాయి. వర్షం కారణంగా శుక్రవారం మ్యాచ్‌లు సాధ్యపడలేదు. దీంతో శనివారమే నాలుగు లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. పూల్-ఏలో వారియర్స్, చార్జర్స్‌పై టైగర్స్ విజయాలు సాధించగా.. పూల్-బిలో డెవిల్స్, టైటాన్స్‌పై ఆర్టిస్ట్స్ జట్టు గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో టైగర్స్, ఆర్టిస్ట్స్ తలపడనున్నాయి. టైగర్స్ తరఫున చైతన్యకుమార్, విశాల్ సింగ్, అర్జున్ రెడ్డి బరిలోకి దిగుతుండగా, ఆర్టిస్ట్స్ నుంచి అర్సలాన్ ఖాన్, వేదాంత్ లోహియ, షెహజాద్ ఖాన్‌లు పోటీపడనున్నారు.






కామెంట్‌లు (0)