Magazines

సమన్వయంతో పని చేయండి

3 గంటల క్రితం

coordination
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లపై సీఎస్‌ ‌సంజయ్‌ ‌జాజుకు వివరిస్తున్న శాట్‌ ఎండీ సోనీబాలా దేవి

యూత్‌ ‌గేమ్స్‌ ‌నిర్వహణపై సీఎస్‌ ‌సంజయ్‌ ‌జాజు

గచ్చిబౌలి, యూసుఫ్‌‌గూడ స్టేడియాల్లో ఏర్పాట్ల పరిశీలిన


నవతెలంగాణ-హైదరాబాద్: 8వ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ ‌డిసెంబర్‌ 11 ‌నుంచి 22 వరకు తెలంగాణలో జరుగనుండగా.. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి, యూత్‌ ‌గేమ్స్‌‌ను విజయవంతంగా నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు సూచించారు. ఖేలో ఇండియా యూత్‌ ‌గేమ్స్‌‌కు ఆతిథ్యం ఇవ్వనున్న గచ్చిబౌలి స్టేడియం, యూసుఫ్‌‌గూడ స్టేడియాలను సీఎస్‌ ‌శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించారు. స్టేడియాల్లో జరుగుతున్న ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు సౌకర్యాల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్ గచ్చిబౌలి స్టేడియం, యూసుఫ్‌గూడ స్టేడియంలను సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడాకారులకు కల్పించాల్సిన సౌకర్యాలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ‘రాష్ర్ట ప్రభుత్వం ఖేలో ఇండియా యూత్‌ ‌గేమ్స్‌‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుకుంటోంది. ఈ పోటీల నిర్వహణతో క్రీడలపై తెలంగాణ దార్శనికత ప్రతిబింబించాలి. దేశవ్యాప్తంగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులు, కోచ్‌‌లు, అధికారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని’ సీఎస్‌ ‌సంజయ్‌ ‌జాజు ఆదేశించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌) ఎండీ సోనీబాలా దేవి, పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పొల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్