Magazines

భారతదేశంలో డీప్-టెక్ ఆవిష్కరణలు మరియు స్టార్టప్ వృద్ధిని చేయడానికి ఒప్పందం

8 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముంబై: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) యొక్క ఒక కార్యక్రమమైన MeitY Startup Hub (MSH), IBM తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. IBM యొక్క సాంకేతిక నైపుణ్యం, మార్గదర్శకత్వం, ఎంటర్‌ప్రైజ్ కలిసి పనిచేసే అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్టార్టప్‌ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను స్టార్టప్‌లకు అందించడం ద్వారా భారతదేశపు డీప్ టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను వేగవంతం చేయడమే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం.

ఈ భాగస్వామ్యం, MeitY Startup Hub యొక్క దేశవ్యాప్త ఆవిష్కరణల నెట్‌వర్క్‌ను మరియు IBM యొక్క ఎంటర్‌ప్రైజ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్ , క్వాంటం కంప్యూటింగ్ నైపుణ్యాన్ని ఒకచోట చేర్చుతుంది. తద్వారా, అధిక సామర్థ్యం గల స్టార్టప్‌లు భారతదేశం,  ప్రపంచ మార్కెట్ల కోసం సాంకేతికతలను నిర్మించడానికి, ధృవీకరించడానికి, విస్తరించడానికి సహాయపడుతుంది. వినియోగదారులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులతో ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ స్టార్టప్‌లు అనుసంధానం కావడానికి మార్గాలను విస్తరించడం ద్వారా ఇది భారతదేశంలో IBM Ventures కొనసాగిస్తున్న కార్యక్రమాలకు తోడ్పాటునిస్తుంది.

MSH, CEO, Dr. Panneer Selvam Madana Gopal మాట్లాడుతూ, "భారతదేశపు స్టార్టప్ ఎకోసిస్టమ్, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రపంచ చోదక శక్తిగా ఆవిర్భవిస్తోంది. IBMతో ఈ భాగస్వామ్యం ద్వారా స్వదేశీ డీప్ టెక్ సామర్థ్యాలను బలోపేతం చేయడం, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, 'వికసిత్ భారత్'కు దోహదపడే పరిష్కారాలను రూపొందించడానికి ఆవిష్కర్తలకు గొప్ప అవకాశాలను కల్పించడం మా లక్ష్యం" అని అన్నారు.

ఈ భాగస్వామ్యంలో భాగంగా, వ్యాపార అవసరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు స్టార్టప్‌లకు IBM యొక్క ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలు, ఆవిష్కరణ వేదికలను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. దీనిలో, ఎంటర్‌ప్రైజ్‌లకు సిద్ధంగా ఉన్న ఏఐ  మరియు డేటా ప్లాట్‌ఫారమ్ అయిన  IBM watsonx ; సంస్థల కోసం ఏఐ కోడింగ్ ఏజెంట్ అయిన IBM Bob; డిజిటల్ సార్వభౌమత్వం కోసం ఏఐ -సిద్ధంగా ఉన్న సాఫ్ట్‌వేర్ స్టాక్ అయిన IBM  Sovereign Core; IBM యొక్క hybrid cloud, క్వాంటం కంప్యూటింగ్‌పై సాంకేతిక అవగాహన; భద్రత, ఆటోమేషన్ పరిష్కారాల వంటి టెక్నాలజీలపై సాంకేతిక మార్గదర్శకత్వం మరియు సాధికారత వంటివి ఉంటాయి.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రభుత్వ, పారిశ్రామిక రంగాలతో పాటు ఇతర రంగాలలో, వివిధ వృద్ధి దశలలో ఉన్న స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలను IBM మరియు MSH సంయుక్తంగా అన్వేషిస్తాయి. ఈ భాగస్వామ్యం ఎంటర్‌ప్రైజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌లు, సార్వభౌమ ఏఐ ఆవిష్కరణ, ఓపెన్-సోర్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం, సాంకేతిక నైపుణ్యాలు,  స్టార్టప్‌లు తమ పరిష్కారాలను సంస్థలకు, పెట్టుబడిదారులకు ప్రదర్శించే అవకాశాలపై దృష్టి సారిస్తుంది. టైర్ 2 మరియు టైర్ 3 నగరాల నుండి ప్రతిభావంతులైన ఆవిష్కర్తలను గుర్తించి, ప్రోత్సహించడం, తద్వారా భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న డీప్ టెక్ ఎకోసిస్టమ్‌కు అవకాశాలను విస్తృతం చేయడం ఒక ముఖ్య ప్రాధాన్యతగా ఉంటుంది.

"ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, మన దేశ డీప్-టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి మా ఉమ్మడి నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. భారతదేశం, ప్రపంచం కోసం సాంకేతికత-ఆధారిత వృద్ధి యొక్క భవిష్యత్తును రూపొందించడంలో ఈ స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి," అని IBM India & South Asia Managing Director Sandip Patel అన్నారు. " MeitY Startup Hub తో కలిసి, వ్యవస్థాపకులు వేగంగా ఆవిష్కరణలు చేయడానికి, బాధ్యతాయుతంగా విస్తరించడానికి, జాతీయ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించే పరిష్కారాలను రూపొందించడానికి మేము సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.  తద్వారా ఆశాజనకమైన ఆవిష్కరణలను వాస్తవ ప్రపంచంలో ప్రభావం చూపే పరిష్కారాలుగా మార్చేందుకు కృషి చేస్తాం" అని అన్నారు. 

భారత్‌లో స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలకు మద్దతు అందించేందుకు IBM కొనసాగిస్తున్న ప్రయత్నాలకు ఈ అవగాహన ఒప్పందం మరింత బలాన్ని చేకూరుస్తుంది. గత కొన్నేళ్లుగా IBM వ్యవస్థాపకులు, డెవలపర్లు, విద్యాసంస్థలు, స్టార్టప్‌ వ్యవస్థలోని భాగస్వాములతో కలిసి పనిచేస్తూ.. అత్యాధునిక సాంకేతికతలు, సాంకేతిక మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను స్టార్టప్‌లకు అందిస్తోంది. ఇందులో IBM ventures ద్వారా చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇది తన క్యాపిటల్-ప్లస్ మోడల్ ద్వారా తదుపరి తరం ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీని నిర్మిస్తున్న ప్రతిభావంతులైన వ్యవస్థాపకులకు పెట్టుబడులతో పాటు సాంకేతిక, వ్యాపారపరమైన మద్దతును అందించే విధానాన్ని IBM Ventures అనుసరిస్తోంది. IBMకు ఉన్న అంతర్జాతీయ స్థాయి నెట్‌వర్క్‌, విస్తృతమైన నిపుణుల వ్యవస్థను ఉపయోగించుకుని స్టార్టప్‌లు తమ వ్యాపారాలను విస్తరించేందుకు తోడ్పడుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్