నవతెలంగాణ-హైదరాబాద్ : జెనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (జిసిఎల్ఐ), భారత్ పై దృష్టి సారించిన సమీకృత మీడియా వ్యూహంతో, తన జాతీయ బ్రాండ్ ప్రచారమైన 'హియర్.నౌ.' తాలూకు తాజా అధ్యాయాన్ని ప్రారంభించింది. పిల్లల భవిష్యత్ ప్రణాళిక, పదవీ విరమణ సన్నద్ధత పై దృష్టినిలపడాన్ని కొనసాగిస్తూ, ఈ ప్రచారం బ్రాండ్ తాలూకు 'మీ నిర్భయ కలల కోసం పెద్దగా ఆలోచించండి' అనే తత్వాన్ని సజీవంగా నిలుపుతుంది. జీవితంలో ప్రతి దశలోనూ పెద్ద కలలు కనడానికి, ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి ఇది వినియోగదారులని ప్రేరేపిస్తుంది. పెరుగుతున్న విద్యా ఖర్చులు తల్లిదండ్రులను ముందుగానే ప్రణాళికలు వేసుకునేలా హెచ్చరిస్తున్నప్పుడు, పెరుగుతున్న ఆయుర్దాయం పదవీ విరమణ అవసరాలను పునర్నిర్వచిస్తుప్పుడు, మనం ఊహించుకున్న భవిష్యత్తు కోసం ఈరోజే చర్యలు తీసుకోవలసిన ప్రాముఖ్యతను ఈ ప్రచారం నొక్కి చెబుతోంది.
జీవిత అనూహ్యతల్లోకూడా దీర్ఘకాల ఆకాంక్షలకు కొనసాగింపు అవసరమన్న విషయాన్ని గురిస్తూ, చెల్లుబాటయ్యే బేస్ ప్లాన్స్ పై ప్రీమియం రైడర్ ని మాఫీ చేయడాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది. దీర్ఘకాలిక ప్రణాళికలకు మరింత కొనసాగింపుని జోడించేందుకు రూపుదిద్దిన ఈ రైడర్ మాఫీ, రైడర్ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, అర్హత అవసరాల క్రింద పేర్కొన్న విధంగా వాటిల్లో కవర్ అయ్యే ఆకస్మిక సంఘనల సంభవించినప్పుడు భవిష్యత్ ప్రీమియంలను మాఫీ చేస్తుంది, అదే సమయంలో పాలసీ ప్రయోజనాలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయి. ప్యూర్-రిస్క్ ప్రీమియం రైడర్‌గా అందుబాటులో ఉన్న దీని ద్వారా, ప్రమాదవశాత్తు సంపూర్ణ, ఇంకా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు, కవరయ్యే తీవ్ర అనారోగ్యాలు నిర్ధారణ అయినప్పుడు, వర్తించే చోట, పాలసీదారు మరణించిన సందర్భంలో భవిష్యత్ ప్రీమియంల మాఫీని వినియోగదారులు ఎంచుకోవచ్చు. ఊహించని అవాంతరాలు ఎదురైనప్పుడు వాటి నుంచి దీర్ఘకాలిక ప్రణాళికలకు రక్షణ కల్పించడం ద్వారా, ఏ లక్ష్యాలని సాధించడానికి వినియోగదారులు ఈ రోజు కృషి చేస్తున్నారో వాటిని రేపు కూడా కొనసాగించవచ్చనే గొప్ప విశ్వాసాన్ని వారికి ఈ రైడర్ అందిస్తుంది.
జీవితంలోని కీలక దశలలో వినియోగదారులకు మద్దతు ఇవ్వడానికి, కంపెనీ పోర్టుఫోలియోలో పిల్లల భవిష్యత్ ప్రణాళిక కోసం రూపొందించిన జీవిత బీమా పరిష్కారాలు ఉన్నాయి. వీటిలో జనరాలి సెంట్రల్ లాంగ్ టర్మ్ ఇన్‌కం ప్లాన్, జనరాలి సెంట్రల్ మనీ బ్యాక్ సూపర్ ప్లాన్, జనరాలి సెంట్రల్ అస్యూర్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ వంటివి ఉన్నాయి. పదవీ విరమణ సన్నద్ధత కోసం, జనరాలి సెంట్రల్ సునేహ్రా పెన్షన్ ప్లాన్, జనరాలి లైఫ్‌టైం పార్ట్నర్ ప్లాన్, జనరాలి సెంట్రల్ మనీ బ్యాక్ సూపర్ ప్లాన్ వంటి పథకాలు దీర్ఘకాలిక లక్ష్యాల దిశగా క్రమబద్ధమైన మార్గాలను అందిస్తాయి.
ఈ ప్రచారానికి కేంద్రబిందువు బాడా సోచో డ్రీమ్స్ వాల్. ఇది ఒక ఇంటరాక్టివ్ డిజిటల్ ప్లాట్‌ఫాం, తమ ఆకాంక్షలు సాధించుకునే దిశగా ఒక అర్థవంతమైన చర్యకు ప్రతినపూనమని ఇది వ్యక్తులును ఆహ్వానిస్తుంది. ప్రజలను వారి కలల్ని రాసుకోడానికి, ఒక స్పష్టమైన తదుపరి అడుగుకు కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడం ద్వారా, ఈ ప్లాట్‌ఫాం సంకల్పాన్ని ఆచరణగా మారుస్తుంది, అలాగే ఈ రోజు తీసుకున్న నిర్ణయాల ద్వారానే అర్థవంతమైన ఫలితాలు సాధించొచ్చనే నమ్మకాన్ని బలపరుస్తుంది.
జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి & సిఇఒ శ్రీ అలోక్ రుంగ్తా, ఈ ప్రచారం సంకల్పాన్ని ఆచరణలోకి మార్చే విషయం పై దృష్టి సారించడం గురించి వ్యాఖ్యానిస్తూ, “భారతీయ కుటుంబాలకు పిల్లల భవిష్యత్తుకు ప్రణాళిక, పదవీ విరమణ సన్నద్ధత అనే రెండు అత్యంత ముఖ్యమైన ఆర్థిక ప్రాధాన్యతలు ఉన్నాయి, ఇవి రెండూ కలిసి జీవిత బీమా విభాగంలో దాదాపు 70% గా ఉన్నాయి. ఆకాంక్షలు నిరంతరం మారుతున్నందున, వ్యక్తులు వారి లక్ష్యాలను నిర్మించుకోవడానికి సహాయపడటమే కాకుండా, జీవితంలోని అనిశ్చితుల నుంచి తమను తాము కాపాడుకునే పరిష్కారాల కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. ఊహించని పరిస్థితులలో కూడా ఆర్థిక ప్రణాళికల కొనసాగింపును నిర్ధారించడంలో సహాయపడటం ద్వారా, ప్రీమియం రైడర్ మాఫీ అనేది మా ప్రతిపాదనను మరింత బలోపేతం చేస్తుంది. మా ఇటీవలి చొరవతో, వినియోగదారులను వారి భవిష్యత్తు వైపు ఒక అర్థవంతమైన అడుగు వేయమని ప్రోత్సహిస్తూనే, ఒక విశ్వసనీయ జీవితకాల భాగస్వామిగా ఉండే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. జనరాలి తాలూకు ప్రపంచవ్యాప్త నైపుణ్యం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు విశ్వసనీయ వారసత్వంతో, భారతదేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు జీవిత బీమాను మరింత సరళంగా, మరింత సందర్భోచితంగా, మరింత అందుబాటులోకి తీసుకురావడంపై మేము దృష్టి సారించాం" అన్నారు.
భారతదేశం నలుమూలలకూ చేరి, ప్రజల్లో ప్రభావం చూపేలా రూపొందించిన ఈ ప్రచారం, టెలివిజన్, ట్రాన్సిట్ మీడియా, క్రికెట్, ఒటిటి, ఇంకా డిజిటల్ ప్లాట్‌ఫాంలలో, పది భాషలలో 100కు పైగా బహిరంగ నగరాలలో విస్తరించి ఉన్న బలమైన మీడియా అవకాశాల సమ్మేళనాన్ని వినియోగించుకుంటుంది. ప్రముఖ వార్తా, వినోద ఛానెళ్లలో అధిక ప్రభావం చూపే టెలివిజన్ అనుసంధానాల మద్దతుతో, ఈ కార్యక్రమం పట్టణ కేంద్రాలు, సెమీ-అర్బన్ మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.






కామెంట్లు (0)