Magazines

లాభాల్లో ఎస్‌‌బీఐ జోరు

40 నిమిషాల క్రితం

SBI’s strong performance in profits
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

క్యూ2లో రూ.23,038 కోట్లు.. తగ్గిన మొండి బాకీలు

ముంబయి : ప్రభుత్వ బ్యాంకింగ్‌ ‌దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బిఐ) ఆకర్ష ణీయ ఆర్థిక ఫలితాలు సాధిం చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) సెప్టెంబర్‌‌తో ముగి సిన రెండో త్రైమాసికం (క్యూ2) లో రూ.23,038 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.20,160 కోట్లతో పోల్చితే 14.3 శాతం వృద్ధి చోటు చేసు కుంది. నికర వడ్డీ ఆదాయం పెరగడంతోపాటు మొండి బాకీల కోసం చేసే కేటాయింపులు తగ్గ డం లాభాల వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి. గడిచిన క్యూ2 లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) ఏడాది ప్రాతిపదికన 14.7 శాతం పెరిగి రూ.49,143 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో రూ.42,847 కోట్లు ఉంది. మరోవైపు ఇతర ఆదాయం మాత్రం 23.8 శాతం క్షీణించి రూ.11,777 కోట్లకు పరిమిత మైంది. మొండి బాకీల కోసం చేసే కేటాయింపులు 21.9 శాతం తగ్గి రూ.4,217 కోట్లకు చేరడం లాభాలకు ప్రధాన మద్దతును అందించాయి.

ఆస్తుల నాణ్యతలోనూ బ్యాంకు మెరుగైన పురోగతి సాధించింది. 2026 సెప్టెంబర్ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల (జిఎన్‌‌పిఎ) నిష్పత్తి గతేడాది 1.73 శాతంతో పోలిస్తే 1.39 శాతానికి తగ్గింది. జూన్ త్రైమా సికంలో ఇది 1.47 శాతంగా ఉంది. నికర ఎన్‌పిఎల నిష్పత్తి సైతం గతేడాది 0.42 శాతం నుంచి 0.36 శాతానికి మెరుగు పడింది. విలువ పరంగా స్థూల ఎన్‌పిఎలు రూ.72,529 కోట్లకు తగ్గగా, నికర ఎన్‌పిఎలు రూ.18,546 కోట్లుగా నమోద య్యాయి. వ్యాపార విస్తరణలో నూ ఎస్‌‌బిఐ రాణించింది. సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకు మొత్తం రుణాలు వార్షికంగా 18.2 శాతం పెరిగి రూ.51.54 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు 12.3 శాతం వృద్ధితో రూ.62.78 లక్షల కోట్లకు పెరిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్