నవతెలంగాణ-హైదరాబాద్ : ఫ్రాన్స్‌లోని న్యూవిల్లే-సుర్-సాన్ నగరంలో ఒక వ్యక్తి తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవడానికి తవ్వకాలు చేపట్టినప్పుడు ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలు, నాణేలు లభించాయి. ఏడాది క్రితం కొన్న ఇంటి వెనుక తోటలో కార్మికులకు ఈ బంగారం కనిపించింది. యజమాని వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాడు. పురావస్తు శాఖ దీనికి ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత లేదని గుర్తించింది. ప్రస్తుతం నిధి యజమాని ఎవరు, అది అక్కడ ఎలా వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్ తవ్వుతుండగా బయటపడ్డ ఏడు కోట్ల బంగారు నిధి..
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)