నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గురువారం (19న) ఇందిరాగాంధీ జయంతి సందర్బంగా జరగాల్సిన ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత పెన్షన్ల నిధుల జమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26కి వాయిదా వేసింది. సిద్దిపేటలో సీఎం చేతుల మీదుగా ఇవి ప్రారంభం కావాల్సి ఉండగా..దీన్ని విడిగా నిర్వహించాలని నిర్ణయించి ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోటిమంది మహిళలకు చీరల పంపిణీతో పాటు 4,63,857 మందికి చేయూత పెన్షన్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో దివ్యాదేవరాజన్కు ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు ఈసారి చిలకపచ్చ చీరలను తయారుచేయించగా అవి జిల్లాలకు చేరాయి. పెన్షన్ పత్రాల పంపిణీ కూడా పూర్తయింది.
చీరల పంపిణీ, కొత్త పెన్షన్ల జమ 26కు వాయిదా
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)