Magazines

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి

15 గంటల క్రితం

Army jawan dies in road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : పండుగకు సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్‌కు చెందిన పల్లపు మహేందర్‌ (26) ఐదేళ్లుగా ఆర్మీలో జవాన్‌గా సేవలందిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా 25 రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. సోమవారం బుల్లెట్‌పై వెళ్తుండగా సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లి చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మహేందర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో బైక్‌పై ఉన్న రామలింగం తీవ్రంగా గాయపడ్డాడు. జవాన్‌ మృతితో కొండాపూర్‌ గ్రామంలో విషాదం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్