నవతెలంగాణ - హైదరాబాద్ : బాంబు బెదిరింపులతో యూరప్ అంతటా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. హెల్సింకి నుంచి రోమ్ వెళ్తున్న ఫిన్‌ఎయిర్ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఇటలీ వైమానిక దళం ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. వాటి రక్షణలో విమానం రోమ్‌లోని ఫియుమిసినో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. మరోవైపు డబ్లిన్ నుంచి రోమ్ వెళ్తున్న ఏయిర్ లింగస్ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఎవరెక్స్ మిలిటరీ ఎయిర్‌బేస్‌కు మళ్లించారు. మిలాన్ నుంచి వార్సా వెళ్తున్న విజ్ ఎయిర్ విమానాన్ని వియన్నాకు మళ్లించారు. బల్గేరియా, బెల్జియంలోనూ ఇలాంటి హెచ్చరికలు వచ్చాయి. అయితే ఇవన్నీ నకిలీ బెదిరింపులేనని, తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
బాంబు బెదిరింపులతో యూరప్‌లో విమాన సర్వీసులకు అంతరాయం
14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)