నవతెలంగాణ-హైదరాబాద్ : అక్వాన్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో గురువారం, శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వెదర్‌మ్యాన్ తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సిరిసిల్ల, సిద్దిపేటలో కనిష్ఠంగా 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. అలాగే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్లు 10 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






కామెంట్‌లు (0)