Magazines

పత్తి దిగుమతి సుంకం మినహాయింపు గడువు పెంపు

5 గంటల క్రితం

Cotton import duty exemption deadline extended
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దేశీయ టెక్స్‌టైల్ రంగంలో పత్తి లభ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై ఉన్న సుంకం మినహాయింపు గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఈ మినహాయింపు అక్టోబర్ 31తో ముగియాల్సి ఉండగా, ప్రభుత్వం దానిని మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల జౌళి తయారీదారులకు ముడిసరుకు వ్యయం తగ్గి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్