నవతెలంగాణ - హైదరాబాద్ : 3,897 బ్యాంకు ఖాతాలపై సైబర్‌దాడి జరిగినట్లు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ ఖాతాదారుల రికార్డులన్నీ డార్క్‌వెబ్‌లోకి వెళ్లాయని తెలిపింది. 3,897 కస్టమర్ల పేర్లు, సెల్ నంబర్లు డార్క్‌వెబ్‌లో బహిర్గతం అయినట్లు వెల్లడించింది. పుట్టిన తేదీలు, ఈమెయిల్ చిరునామాలు బహిర్గతం అయ్యాయని ఎస్‌బీఐ పేర్కొంది. బ్రాండ్, కస్టమర్ గుర్తింపులు, రుణ రికార్డులు ఉన్నాయని, అయితే సమాచారం లీక్ వల్ల బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై పెద్ద ప్రభావం ఉండదని ఎస్‌బీఐ వెల్లడించింది.
SBI బ్యాంకు ఖాతాలపై సైబర్‌దాడి
21 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)