Magazines

మరణించిన జనసేన అభ్యర్థి..ఎంపీటీసీ ఫలితాల్లో విజయం

7 గంటల క్రితం

Deceased Jana Sena candidate wins in MPTC election results
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల కౌంటింగ్‌కు ఒక రోజు ముందు గుండెపోటుతో మరణించిన జనసేన అభ్యర్థి గారపాటి దివ్య(28) నేడు విడుదలైన ఫలితాల్లో విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం. ధుమంతునిదూడెం నుండి దివ్య ఎంపీటీసీగా పోటీ చేశారు. ఫలితాలలో వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. జనసేన పార్టీలో ఆమె, ఆమె భర్త యాక్టివ్గా పనిచేసేవారు. ధుమంతునిగూడెం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రిజర్వేషన్లో భాగంగా మహిళకు రావడంతో జనసేన నుంచి దివ్య అభ్యర్థిగా నిలిచింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దివ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని జనసేన పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్