Magazines

నాల్గో వన్డేలో మాట్ హెన్రీ బౌలింగ్ మాయజలం చూశారా..వీడియో

14 గంటల క్రితం

Did you see Matt Henry’s magical bowling in the fourth ODI? – Video
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: శుక్రవారం మౌంట్ మాంగనూయిలో న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. 334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కేవలం 89 పరుగులకే ఆలౌటైంది. 244 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టు బౌలింగ్ దళానికి నాయకత్వం వహించిన మాట్ హెన్రీ, సంచలనాత్మకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లతో(రోహిత్, విరాట్, అయ్యార్) భారత్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన అతను, ఆ తర్వాత తిరిగి వచ్చి లోయర్ ఆర్డర్‌ను కూడా ఊడ్చేశాడు. ప్రస్తుతం ఐదు వన్డేల సిరీస్ లో 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది.




సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్