నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటినీ డెమోక్రాట్ కైవసం చేసుకుంది. డెమోక్రాట్ల విజయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాత్రి అమెరికా ప్రజలు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారని అన్నారు. ప్రజలను విభజించే రాజకీయాలను కాకుండా, వారిని ఏకం చేసే రాజకీయాలను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లకు నిర్దిష్ట పరిష్కారాలను అందించే నేతలను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
దేశంలోని ప్రతి ప్రాంతంలో, ఒకప్పుడు గెలుపు అసాధ్యం అనుకున్న ప్రాంతాలతో సహా, అత్యుత్తమ అభ్యర్థుల కారణంగానే ఈ ఫలితం సాధ్యమైందని అన్నారు. విభిన్ననేపథ్యాలు, విభిన్న రాజకీయ దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించారు కానీ ఉమ్మడి విలువలు, ప్రజాసేవపై నమ్మకం, తమ రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే నిబద్ధతతో ఏకమయ్యారని అన్నారు. "సజావైన ఎన్నికలు సజావుగా జరిగేలా చూసిన ఎన్నికల అధికారులు, వాలంటర్లీకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిపాలనా యంత్రాంగానికి ఇంకారెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం కష్టపడి పనిచేయడం, మనకు అధికారం ఉన్న చోట మార్పులు తీసుకురావడం, మరిన్ని నష్టాలను నివారించడం , భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు.





కామెంట్‌లు (0)