Magazines

పెళ్ళి తర్వాత మొదలయ్యే ప్రేమకథ

14 నిమిషాల క్రితం

story
avatar
balaji

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘#బాలుగీత’. సందీప్ సరోజ్, కేయురి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకుడు. నేటి (గురువారం) నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్‌లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ, ‘అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. అన్నపూర్ణ నుంచి మేము ఈ కథ చెప్పగానే బాపినీడు వెంటనే చేసేద్దాం అన్నారు. చాలా యంగ్ టాలెంట్‌తో చేసిన సినిమా ఇది. మేము చాలా మంచి సినిమా తీశాం. చిన్న కథలు, మనసుకు హత్తుకునే కథలు చేసినప్పుడు, కొత్తవాళ్లను పరిచయం చేసినప్పుడు వాటికి వచ్చే అభినందనలు వేరే సంతృప్తినిస్తాయి. అలాంటి మంచి సాటిస్ఫాక్షన్ ఈ సినిమా ఇచ్చింది. ఈ సినిమాను మనసుపెట్టి తీశాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు’ అని తెలిపారు.

‘పెళ్లి తర్వాత మొదలయ్యే ప్రేమకథ ఇది. చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా చూశాక ఒక తోడు ఉంటే బాగుంటుందని ఫీలింగ్ పక్కా కలుగుతుంది’ అని హీరో సందీప్ సరోజ్ చెప్పారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ‘ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ముల సినిమా లాగా అనిపించింది’ అని అన్నారు. ‘ప్రేమకథలు చాలా ఉంటాయి. ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న జంట తాలూకు ప్రేమకథ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి మధ్య జరిగే ప్రేమకథ గురించి చూపించాం. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లు తప్పకుండా ఈ సినిమా చూడాలి. అందరూ రిలేట్ అయ్యే సినిమా ఇది’ అని డైరెక్టర్ ప్రతాప్ కొల్లారెడ్డి చెప్పారు. ఈటీవీ విన్‌ కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ,‘చాలా బ్యూటిఫుల్ కథ. ప్రతాప్ ఒక అద్భుతమైన కంటెంట్‌తో వచ్చాడు. నేటి (గురువారం) నుంచి ఈ సినిమా వస్తోంది. తప్పకుండా ఈ సినిమాను మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్