Magazines

పెద్దలు కూడా పిల్లల్లా ఎంజాయ్‌ చేస్తారు

18 నిమిషాల క్రితం

Adults
avatar
balaji

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీకర్ దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న ఈ సినిమా రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. జయసుధ మాట్లాడుతూ,‘ఈ సినిమాలో అమ్మమ్మ పాత్రలో నటించాను. ఇది పిల్లల సినిమా కాదు ఇద్దరు చిన్న హీరోలు నటించిన సినిమా. పేరెంట్స్, అమ్మమ్మ, వేసవి సెలవులు...ఈ అంశాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ధీరజ్ ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేయాలి. కొత్త దర్శకులకు, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలి. పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చిన్న చిత్రాలు నిర్మించాలి’ అని అన్నారు.

‘ఇది గుర్తుండిపోయే సినిమా, పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని డైరెక్టర్ శ్రీకర్ నయన్ అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ,‘ఇది పిల్లల సినిమా కాదు పెద్దల సినిమా. కథ విన్నప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్లు అందరూ కనెక్ట్ అవుతారని నమ్మాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీ బాల్యం గుర్తుకు వస్తుంది. ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీ చిన్ననాటి స్నేహితులకు ఫోన్స్ చేస్తారు’ అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,‘ఈ వేడుక చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ సినిమా కంటెంట్ చూస్తున్నంత సేపు మనకు తెలియని ఎమోషన్స్ కనెక్ట్ చేస్తున్నారు అనిపించింది. ఈ సినిమా మనం మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంది. ఈ సినిమా ద్వారా మనల్ని మన అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తారని నమ్ముతున్నాను’ అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్