Magazines

మహిళలకు గుడ్ న్యూస్‌

12 గంటల క్రితం

Good news for women
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.334 కోట్లను కేటాయించింది. రేషన్‌ కార్డు కలిగిన మహిళలు ఆధార్‌ కార్డుతో పంపిణీ కేంద్రాలకు వెళ్లి చీరలు పొందవచ్చు. పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్‌ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్