Magazines

వైట్‌హౌస్ వద్ద హై అలర్ట్..ముగ్గురు ఆరెస్టు

12 గంటల క్రితం

High alert at the White House..three arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద భద్రతాపరమైన కలకలం రేగింది. రెండు వేర్వేరు ఘటనల నేపథ్యంలో అధికారులు దాదాపు అరగంట పాటు వైట్‌హౌస్‌ను లాక్‌డౌన్‌ చేశారు. వైట్‌హౌస్‌కు సమీపంలోని లాఫాయెట్‌ పార్క్‌ వద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి సిల్వర్‌ రంగు కారును వేగంగా నడుపుతూ ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి సూచిక బోర్డును ఢీకొట్టాడు. అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌, నేషనల్‌ గార్డ్‌ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో పార్క్‌ వాయవ్య మూలలో మరో వ్యక్తి భద్రతా బారికేడ్లను దాటి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అతడిని కూడా అరెస్ట్‌ చేశారు. నిందితుల వివరాలు, వారి చర్యల వెనుక ఉద్దేశాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలతో తాత్కాలికంగా నిలిపివేసిన వైట్‌హౌస్‌ కార్యకలాపాలను అరగంట తర్వాత పునరుద్ధరించారు.


ఇదిలా ఉండగా, గత గురువారం వైట్‌హౌస్‌ సమీపంలో ఆయుధాలతో సంచరిస్తున్న వెనిజులా జాతీయుడు రోనీ యోడ్రిక్స్‌ గువానిపా క్రినోస్‌ (30)ను సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. కాన్‌స్టిట్యూషన్‌ అవెన్యూలో అనుమానాస్పదంగా పార్క్‌ చేసి ఉన్న పికప్‌ ట్రక్కును తనిఖీ చేయగా, అందులో రైఫిల్‌, రెండు చేతి తుపాకులు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి లభించినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హతమార్చాలని తనకు స్వరాలు ఆదేశించాయని నిందితుడు చెప్పినట్లు హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. వరుస ఘటనల నేపథ్యంలో వైట్‌హౌస్‌ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్