ఐఐటీ మద్రాస్ కీలక నిర్ణయం..

1 గంట క్రితం

IIT Madras takes a key decision..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్ (ఐఐటీ-ఎం) బీటెక్ విద్యార్థుల కోసం ఆరు నెలల సుదీర్ఘ ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న రెండు నెలల వేసవి ఇంటర్న్‌షిప్ స్థానంలో ఈ కొత్త విధానం 2027 జనవరి నుంచి అమలు కానుంది. 2024లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇది వర్తించనుండగా, ఆరో సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇన్‌స్టిట్యూట్ కెరీర్ పాత్‌వే సెంటర్ (సీపీసీ) ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. పరిశ్రమలు, విద్యార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీసీ చైర్‌పర్సన్ రిచా అగర్వాల్ తెలిపారు. దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్ వల్ల కంపెనీలు విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగ్గా అంచనా వేయడంతో పాటు, విద్యార్థులు పరిశ్రమల పనితీరుపై లోతైన అవగాహన పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

ఇప్పటికే 30కి పైగా కంపెనీలు ఈ ఇంటర్న్‌షిప్‌ల కోసం విద్యార్థులను ఎంపిక చేసుకోగా, 150 మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించడం, ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు (పీపీఓ) పొందే అవకాశాలను మెరుగుపరచడం, పరిశ్రమలతో సంబంధాలను బలోపేతం చేయడమే ఐఐటీ మద్రాస్ లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్