నవతెలంగాణ - హైదరాబాద్ : టెలికాం వినియోగదారులకు ఊరట కలిగించేలా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లను యాప్‌లు, వెబ్‌సైట్‌లలో వెతకడం కష్టంగా ఉందనే ఫిర్యాదులపై స్పందించింది. ఇకపై టెలికాం సంస్థల యాప్‌లు, వెబ్‌సైట్‌లలో ‘TRAI-Mandated Packs’ పేరుతో ప్రత్యేక ట్యాబ్ ఏర్పాటు చేసి, అందులో చౌకైన రీఛార్జ్ ప్లాన్లను ముందుగా చూపించాలని ఆదేశించింది. ఈ మార్పులను 30 రోజుల్లోగా అమలు చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో వినియోగదారులు తక్కువ ధర ప్లాన్లను సులభంగా గుర్తించి రీఛార్జ్ చేసుకునే అవకాశం కలగనుంది.






కామెంట్‌లు (0)