Magazines

మహిళ గైడ్ ను సముద్రంలోకి తోసేసిన ఇజ్రాయెల్ పర్యాటకుడు

35 నిమిషాల క్రితం

Israeli tourist pushes female guide into the sea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయెల్ పర్యాటకుడు శ్రీలంక మహిళ గైడ్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఓ పడవలో ఇజ్రాయెల్ పర్యాటకులతో పాటు శ్రీలంక మహిళా గైడ్‌ కూడా వెళుతున్నారు. ఆ గైడ్ నీరు తాగుతుండగా ఆమె పక్కన కూర్చున్న ఇజ్రాయెల్ టూరిస్టు ఒక్కసారిగా ఆమెను సముద్రంలోకి తోసేశాడు. ఆమెకు సాయం చేయాల్సిన ఇతర పర్యాటకులు పడవలోనే ఉండి నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. దీంతో నెటిజన్లు ఆ ఇజ్రాయెల్ పర్యాటకుడి తీరుపై దుమ్మెత్తి పోశారు. ఆ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలియరాలేదు. తనను టూరిస్టు సముద్రంలోకి తోసిన తర్వాత ఆ మహిళా గైడ్ ఈదుతూ కనిపించారు. తర్వాత ఆమెకు ఏమైందో తెలియరాలేదు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్