Magazines

ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

1 గంట క్రితం

Key decisions by the Union Cabinet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ (CCEA) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.77,101 కోట్లకు పైగా కేటాయించింది. ఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం ఏర్పాటుకు రూ.3,230 కోట్లు, నోయిడా – గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు రూ.2,390 కోట్లు, రబీ 2026-27 సీజన్‌కు ఎరువుల సబ్సిడీ కోసం రూ.62,370 కోట్లు, సూక్ష్మ పరిశ్రమలకు (Micro Units) క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.5,000 కోట్లు, స్టాండ్ అప్ ఇండియా పథకం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.4,111 కోట్లు కేటాయించింది.


మరోవైపు, నోయిడా – గ్రేటర్ నోయిడా మెట్రో ప్రయాణికులకు కేంద్రం కేబినెట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆక్వా లైన్ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు మెట్రో పొడిగించనున్నారు. మొత్తం 8.5 కిలోమీటర్ల మేర ఆక్వా లైన్ మెట్రో కారిడార్ విస్తరణ జరగనుంది. కొత్తగా ఐదు మెట్రో స్టేషన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్