నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. కీలక పోస్టుల్లో కొత్త అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ నియమితులయ్యారు. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించి బదిలీలు, కొత్త పోస్టింగ్స్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీగా వీసీ సజ్జనార్
- జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా
- మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీగా సౌమ్య మిశ్రా
- అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హా
- టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్
- గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్
- సివిల్ సప్లైస్ కమిషనర్‌గా నాగిరెడ్డి
- అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఆకున్ సబర్వాల్
- తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యతలు స్టీఫెన్ రవీంద్ర
- మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ
- హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్






కామెంట్లు (0)