Magazines

నియోజకవర్గ స్థాయి పోటీల్లో జీజేసీ విద్యార్థుల ప్రతిభ

1 గంట క్రితం

GJC students
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

- వ్యాసరచనలో ద్వితీయం.. 

- క్విజ్‌ లో తృతీయం

నవతెలంగాణ - అశ్వారావుపేట

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కళాశాల తరపున పాల్గొన్న ఎండి జీషన్ (సీఈసీ ప్రథమ సంవత్సరం) వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. అలాగే డి. సహస్ర (ఎంపీసీ ప్రథమ సంవత్సరం) క్విజ్ పోటీల్లో తృతీయ స్థానం పొందారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఎ. అనిత, స్టూడెంట్ కౌన్సిలర్ ఎస్‌కే సాహెద్, కళాశాల అధ్యాపకులు అభినందించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్