Magazines

టర్కీ ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది కార్మికులు మృతి

13 గంటల క్రితం

Massive explosion at Turkish steel factory kills 16 workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : టర్కీలోని ఇజ్మీర్‌ ప్రావిన్స్‌ అలియాగా ప్రాంతంలోని హబాస్‌ ఇనుము, ఉక్కు కర్మాగారంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాయిలర్‌ మార్పిడి పనులు జరుగుతుండగా క్రేన్‌ అదుపుతప్పి కొలిమిలో పడటంతో పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో కర్మాగారంలో సుమారు 200 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్