నవతెలంగాణ - హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీపై విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును కేంద్రం ఎందుకు పెండింగ్‌లో పెట్టిందో వెల్లడించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 నుంచి 100కు పైగా సీట్లు సాధిస్తామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పదవులు కల్పించేలా పార్టీ ఇన్‌ఛార్జ్‌తో చర్చిస్తానని తెలిపారు.
బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)