Magazines

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత

11 గంటల క్రితం

Noted cinematographer Shaji Kumar passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ మంగళవారం తెల్లవారుజామున కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 50కి పైగా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన షాజీ కుమార్.. మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. మోహన్‌లాల్ నటించిన ‘పులిమురుగన్’, ‘నరన్’, ‘ఒడియన్’, మమ్ముట్టి నటించిన ‘మధురరాజా’ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. ఇటీవల విడుదలైన ‘తొడరుమ్’ సినిమాకు కూడా సినిమాటోగ్రఫీ అందించారు.

ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. షాజీ కుమార్ మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్