నవతెలంగాణ - హైదరాబాద్ : బిస్లరీ వాటర్ సురక్షితమేమీ కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ వెల్లడించిన నేపథ్యంలో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. తమ నీరు సురక్షితమని చెప్పింది. తాగునీటి సేఫ్టీకి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని.. కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తామని బిస్లరీ తెలిపింది. FSSAI విచారణకు తాము సహకరిస్తామని చెప్పింది. ఇటీవల బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరీక్షించింది. పరిమితికి మించి బ్రోమేట్ స్థాయిలు ఆ నీటిలో ఉన్నట్లు వెల్లడించింది.
మా నీరు సురక్షితమే: బిస్లరీ వివరణ
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)