నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ నెల 14న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 12 నుంచి 14 వరకు జరగనున్న ‘భారత్ సమ్మిట్ 2026 – తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా 13న ప్రియాంక గాంధీ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించనున్నారు. దేశాల మధ్య సంబంధాల బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 14న తెలంగాణకు రాహుల్ గాంధీ, ఖర్గే
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)