Magazines

నేడు గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ భారీ ర్యాలీ.. సంక్షేమ పథకం ప్రారంభం

3 రోజుల క్రితం

Rahul Gandhi to hold a massive rally with gig workers today; welfare scheme to be launched
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : హైటెక్ సిటీలోని శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు జయభేరి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఫుడ్ డెలివరీ సిబ్బంది, క్యాబ్, ఆటో డ్రైవర్లు తదితర ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులకు బీమా, ప్రమాద రక్షణ, జీవనోపాధి భద్రత కల్పించనున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రతకు ఈ పథకం ప్రాధాన్యత ఇవ్వనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్