Magazines

తెలంగాణలో భారీ వర్షాలకు రెడ్ అలర్ట్‌

3 రోజుల క్రితం

Red alert for heavy rains in Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ప్రభావంతో ఈ నెల 27న ఖమ్మం, భద్రాచలం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్