ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు, బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-ఆలేరు టౌను
రైతుల ఆరుగాలం శ్రమకొర్చి కష్టించి పండించిన వరి ధాన్యనికి, ప్రభుత్వ మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకెపి, ఎఫ్పీఓలలో ధాన్యం విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు జరిగిన వెంటనే మూడు రోజులలో రైతుల ఖాతాలలో డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, తాసిల్దారు వి ఆంజనేయులు, పిఎసిఎస్ చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి, సీఈవో ఇందూరి వెంకట్ రెడ్డి, మార్కెట్ సెక్రెటరీ పద్మజ, సూపర్వైజర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గంధమల అశోక్, కే సాగర్ రెడ్డి, నీలం పద్మా వెంకటస్వామి, కానుగు బాలరాజు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)