నవతెలంగాణ హైదరాబాద్:బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కరవు పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తన ముందుచూపుతో నీటిని ఎత్తిపోసుకోవడం వల్లనే ఏపీలో కరవు గానీ, క్రాప్ హాలిడే గానీ లేవని చెబుతూ ఈ విషయంలో ఆయనను అభినందిస్తున్నట్టు తెలిపారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితిపై స్పందిస్తూ,ఇక్కడ లోటు వర్షపాతం కేవలం 17నుండి 20శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరవు దాపురించిందని విమర్శించారు. ఒకవైపు రాష్ట్రంలో తీవ్రమైన కరవు ఉందంటూనే,మరోవైపు మూసీ సుందరీకరణ పేరుతో రూ.1.50లక్షల కోట్ల లూటీకి ప్రభుత్వం సిద్ధమవుతోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అసలు ఏమి జరుగుతుందో రాహుల్ గాంధీకి అవగాహన ఉందా అని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రం కరవుతో అల్లాడుతుంటే మూసీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.






కామెంట్లు (0)