Magazines

రైతులకు షరతులు విధించడం అన్యాయం 

1 గంట క్రితం

It is unfair
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

•రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ

నవతెలంగాణ - మర్రిగూడ 

ఎల్ ని నో పరిస్థితులను సాకుగా చూపి రైతుల స్వీయ ప్రకటన (సెల్ఫ్ డిక్లరేషన్) నిబంధన రైతాంగాన్ని అవమానించడమేనని రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు నిబంధనలు పెట్టడం ఆపి రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రైతు భరోసా ఎకరాకు రూ.40 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు.


ప్రభుత్వం రైతులకు రకరకాల షరతులు విధించి వ్యవసాయాన్ని కట్టడి చేయడం, రైతు తన సొంత పొలంలో వ్యవసాయం చేసుకోవడం కోసం అధికారుల వద్ద అనుమతి తీసుకోవడం అన్యాయం అన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్  ముందు చూపుతో సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతు బీమా అందించి రైతులను ఆదుకున్నది ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఎలాంటి విపత్తులు వచ్చిన ఎదుర్కొనే విధంగా అనేక ప్రాజెక్టు నిర్మించి రైతాంగాన్ని కడుపులో పెట్టుకున్నారని, రెప్పపాటున కూడా కరెంటు కోతలు ఉండేవి కాదని అన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు రామిడి వెంకట రమణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రాపోలు యాదగిరి, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి యాకుబ్, రాష్ట్ర గిరిజన నాయకులు రామావత్ శ్రీను నాయక్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బూరుగు నాగరాజు, గ్రామ ప్రధాన కార్యదర్శి వట్టికోటి శేఖర్, వార్డు సభ్యులు కొండాపురం నరేష్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్