ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి...ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-ఆలేరు రూరల్
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం మంచి మద్దతు ధర కల్పిస్తుందని, రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సూచించారు. ఆలేరు మండలంలోని కొలనుపాక, కొల్లూరు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. దళారులను నమ్మి మోసపోవద్దని, తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ధాన్యాన్ని అక్కడే విక్రయించి మద్దతు ధర పొందాలని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతే రాజు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాకమ్మ వెంకటేష్, ఉపసర్పంచ్ గొట్టం విజేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్లు, మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, వెంకటస్వామి బిజని భాస్కర్, పిక్క శీను, కూళ్ల నర్సింలు, మండల, గ్రామ నాయకులు, మండల యువజన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)