Magazines

చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్‌ వ్యాన్‌.. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

3 గంటల క్రితం

School van
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : జిల్లాలోని తిర్లాపురంలో స్కూల్‌ వ్యాన్‌ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 14 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వ్యాన్‌ చెరువులోకి దూసుకెళ్లడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే విద్యార్థులను బయటకు తీశారు. డ్రైవర్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్