నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్టై 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే, ఆటోమేటిక్‌గా సస్పెన్షన్‌లో ఉన్నట్లే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ప్రత్యేకంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
బిహార్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం కేసులో అరెస్టై 15 రోజుల పాటు కస్టడీలో ఉన్న వ్యవహారంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు ఉద్యోగి సస్పెన్షన్‌ను రద్దు చేసి తిరిగి అదే పోస్టులో నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలని ఆదేశించింది. అదే సమయంలో పాట్నా హైకోర్టు బెయిల్ రద్దు ఉత్తర్వులను కొట్టివేసి, సెషన్స్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను పునరుద్ధరించింది.







కామెంట్‌లు (0)