నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్ పెద్ద చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. చెరువు స్థలాన్ని ఆక్రమణల నుంచి పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భారీ షెడ్డును అధికారులు నేలమట్టం చేశారు. అధికారుల చర్యలతో తీవ్రంగా నష్టపోయామని ఆస్తుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 ఏళ్లుగా క్రమం తప్పకుండా పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. గత మూడు రోజులుగా అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలోనే తాము హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ముందుగా చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను స్పష్టంగా నిర్ణయించాలని, ఆ తర్వాతే తమ భూములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. గతంలోనూ ఇదే చెరువు పరిధిలో కూల్చివేతలు చేపట్టి, చెరువు పునరుద్ధరణ పనుల కోసం కొంత భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రామాంతపూర్ పెద్ద చెరువు వద్ద ఉద్రిక్తత..
3 గంటల క్రితం

Tension at the large pond in Ramanthapur
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)