Magazines

విషాదం..మంజీరా నదిలో గల్లంతైన తల్లీబిడ్డల మృతదేహాలు లభ్యం..

3 గంటల క్రితం

Manjeer river
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మెదక్ జిల్లా కొల్చారంలోని మంజీరా నదిలో మంగళవారం మధ్యాహ్నం గల్లంతైన కామారెడ్డి జిల్లాకు చెందిన గంగుల సరిత (27), ఆమె కుమార్తెలు వైష్ణవి (7), శివానిక (6) ఘటనలో విషాదం చోటుచేసుకుంది. నదిలో దూకుతున్నట్లు సరిత తన అక్కకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. బుధవారం తెల్లవారుజామున చేపట్టిన గాలింపులో వైష్ణవి, శివానిక మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లి సరిత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. సీఐ ఎం. కృష్ణమూర్తి, ఎస్ఐ హమీద్ మోహియుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్