నవతెలంగాణ - హైదరాబాద్ : బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా (57) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తన ఇంటి బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడటంతో తలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ గాయాల కారణంగానే ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. సంజయ్ గుప్తా మరణవార్తను దర్శకుడు అశోక్ పండిట్ ధ్రువీకరించారు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1994లో విడుదలైన ‘ఆతిష్’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సంజయ్ గుప్తా.. ‘కాంటే’, ‘జిందా’, ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’, ‘షూటౌట్ ఎట్ వడాలా’, ‘కాబిల్’, ‘జజ్బా’, ‘ముంబై సాగా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. ముఖ్యంగా ముంబయి అండర్‌వరల్డ్, క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా సినీ రంగానికి సేవలందించారు.







కామెంట్‌లు (0)