నవతెలంగాణ - హైదరాబాద్: తన భార్య ఫ్రీ బస్సు ఎక్కి వెళ్లిపోయిందని, ఆమె ఆచూకీ తెలియడం లేదని ఎమ్మెల్యే ఎదుట ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామంలో జరిగిన ఓ సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి కనకయ్య అనే వ్యక్తి తన కుటుంబ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు.
తన భార్యతో గొడవ జరగడంతో ఆమెను మందలించానని, దీంతో ఆమె ఉచిత బస్సు ఎక్కి వెళ్లిపోయిందని కనకయ్య తెలిపాడు. రెండు మూడు రోజులుగా వెతుకుతున్నా ఆమె ఆచూకీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన భార్య కనిపించకుండా పోవడానికి ఉచిత బస్సు పథకమే కారణమంటూ దాన్ని రద్దు చేయాలని కోరాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫ్రీ బస్సు ఎక్కి భార్య వెళ్ళిపోయింది.. పథకం రద్దు చేయాలి
2 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)