Magazines

'నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్' సృష్టికర్త కరుణాకరే

1 గంట క్రితం

'National Christian Council'
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 2 నిమిషాల చదవడం

- ఈ విషయంలో సందేహాలకు తావులేదు

- బైబిల్ మిషన్ చర్చ్ పాస్టర్ వరప్రసాద్,

- మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు దేవమణి

- ఎన్‍సీసీ పింగుల సామేలు

నవతెలంగాణ-సత్తుపల్లి 

నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్‍సీసీ) అంటేనే  కరుణాకర్ అని, కరుణాకరే ఎన్‍సీసీ సృష్టికర్త అని ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదని బైబిల్ మిషన్ చర్చ్ పాస్టర్ బేతంపూడి వరప్రసాద్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు బేతంపూడి దేవమణి, ఎన్‍సీసీ ముఖ్య నాయకులు పింగుల సామేలు స్పష్టం చేశారు. స్థానిక ​ద్వారకాపురి కాలనీలోని బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరంలో మంగళవారం స్థానిక దైవజనులు ఎన్‍సీసీ జిల్లా ప్రేయర్ వింగ్ ప్రధాన కార్యదర్శి బేతంపూడి వరప్రసాద్ అధ్యక్షతన ఎన్‍సీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో పాల్గొన్న వరప్రసాద్, దేవమణి, సామేలు మాట్లాడుతూ...​ఎన్‍సీసీ సృష్టికర్త అలవాల కరుణాకర్ తప్ప మరొకరు కాదని స్పష్టం చేశారు. గత 30 ఏళ్లుగా సత్తుపల్లి ఏరియాలో సమాజ సేవ చేస్తూ, 5 ఎకరాల సమాధుల స్థలాన్ని సమకూర్చడంతో పాటు రూ. 2 కోట్లతో క్రిస్టియన్ భవన్ నిర్మాణంలో కరుణాకర్ కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఏ సేవకుడికి ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచే కరుణాకర్ పై కొందరు నాయకులు సత్తుపల్లిలోని సంఘ నాయకులకు ఫోన్లు చేసి గందరగోళం సృష్టిస్తున్నారని వారు  మండిపడ్డారు.


ఎన్‍సీసీ స్థాపనలో కరుణాకర్ శ్రమ ఎంతో ఉందని, ఆయనను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కరుణాకరే తమ నాయకుడని, సంస్థ విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఇతరులకు లేదన్నారు. ఎన్‍సీసీలో ఐదుగురు సభ్యులు ఉన్నారని, ఆ ఐదుగురి ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ పదవులు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలవాల కరుణాకర్ మాట్లాడుతూ... కొందరు నాయకులు స్వార్థం కోసం ఎన్‍సీసీ పేరును వాడుకుంటూ పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై శ్యామ్ పాల్ ను ప్రశ్నిస్తే నా ఇష్టం అని సమాధానం ఇవ్వడంపై వ్యవస్థాపక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‍సీసీని తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ​ఈ సమావేశంలో ఎన్‍సీసీ నాయకులు ఎన్. యాకోబు, పి. రవి కిరణ్, ఆర్. ప్రభాకర్, రాబర్ట్ నోబుల్, బూరుగు ఇసాక్, ఏసుపాదం, వేణు పాల్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్