యూబీఐ మేనేజర్ శ్రీనివాస్
నవతెలంగాణ - టెకుమట్ల
మండలంలోని గర్మిల్లపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేకుమట్ల బ్రాంచ్ మేనేజర్ యూబీఐ ఖాతాదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. ఖాతాదారులు బ్యాంకులో రూ.2000లతో ఇన్సూరెన్స్తో రూ.20 లక్షల బీమా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీమా చేసుకోవడం వల్ల కుటుంబానికి ధీమా, భరోసా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్లబెల్లి మొండయ్య, వార్డు సభ్యులు, బ్యాంకు మిత్ర సలిగంటి సంపత్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)