Magazines

అర్హులందరూ ఫారం-18తో దరఖాస్తు చేసుకోవాలి

1 గంట క్రితం

mlc elections
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

- కాసాని నాగశేషాపద్మ, డాక్టర్ ఉదయ్ జ్యోతి

నవతెలంగాణ – అశ్వారావుపేట

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు అర్హులైన వారంతా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకురాల్లు కాసాని నాగశేషాపద్మ, కౌన్సిలర్ డాక్టర్ ఉదయ్ జ్యోతి సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన నమోదు ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని కోరారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఫారం-18 దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తుతోపాటు డిగ్రీ సర్టిఫికెట్ లేదా నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యమైన విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని పేర్కొన్నారు. ఎన్నికల అధికారుల ద్వారా నిర్ణయించిన విధానంలో ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత ఎన్నికల అధికారికి దరఖాస్తు అందజేయవచ్చని తెలిపారు.


పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించే ప్రతినిధిని ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమని వారు పేర్కొన్నారు. అర్హులైన యువతీ యువకులు ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కాసాని నాగశేషాపద్మ, డాక్టర్ ఉదయ్ జ్యోతి సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్